: హైదరాబాద్ లో బ్యాంకుల ఎదుట రేపు, ఎల్లుండి టీడీపీ, బీజేపీ ధర్నా


తెలంగాణలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని టీడీపీ, బీజేపీ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్ లో రేపు బ్యాంకుల ముందు ఆ పార్టీల నేతలు ధర్నా చేయనున్నట్టు టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. నగరంలోని ఆబ్కాబ్ తో పాటు అన్ని బ్యాంకుల దగ్గర రేపు, ఎల్లుండి ధర్నా నిర్వహిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. రైతులను ఆదుకునేందుకు బ్యాంకులు ముందుకు రావాలని ఈ సందర్భంగా రమణ కోరారు.

  • Loading...

More Telugu News