: విషమిస్తున్న జగన్ ఆరోగ్యం... వివరాలు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో, ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు, వైకాపా నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఉదయం ఆయనను వైద్యులు రెండు సార్లు పరీక్షించారు. జగన్ శరీరంలోని కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. 3+ స్థాయి అంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే అని వైద్యులు తెలిపారు. శరీరంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పారు. మరోవైపు ఆయన పల్స్ రేట్ 68, బీపీ 130/80, బ్లడ్ షుగర్ 84 గా ఉంది. బరువు 72.9 కిలోలకు తగ్గింది. కాసేపట్లో సీనియర్ వైద్యుల బృందం నల్లపాడు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు.