: నేడే ఆంధ్రా యూనివర్సిటీ అలుమ్ని మీట్...ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి!
ఆంధ్రా యూనివర్సిటీ అలుమ్నికి సర్వం సిద్ధమైంది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఏయూ స్నాతకోత్సవ మందిరం ముస్తాబైంది. సాయంత్రం ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు ఈ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. అలాగే, సుమారు 3 వేల మంది పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
నేటి కార్యక్రమ వివరాలు...
* సాయంకాలం 4.45 గం.లకు డాక్టర్ మీనాక్షీ అనంతరామ్ అతిథులకు ఆహ్వానం పలుకుతారు.
* 4.50కి ఆంధ్రా యూనివర్సిటీపై రూపొందించిన వీడియోను ప్రదర్శిస్తారు.
* 5 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్నాతకోత్సవ మందిరానికి చేరుకుంటారు.
* 5.15కు ఏయూ విద్యార్థులు ప్రార్థనా గీతం ఆలపిస్తారు.
* 5.20కి అతిథులు జ్యోతి ప్రజ్వలనకావిస్తారు.
* 5.30కి అతిథుల ప్రసంగాలు ప్రారంభం అవుతాయి.
* 5.55కి ఏయూ విశ్రాంత ఆచార్యులు రాజేశ్వరి (90)కి సన్మానం జరుగుతుంది.
* 6.10కి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం ప్రారంభం అవుతుంది.
* 6.30కు సీఎంకు ఏయూ రిజిస్ట్రార్ జ్ఞాపిక అందజేస్తారు.
* 6.35కు ఇతర ప్రముఖుల ప్రసంగాలు ప్రారంభం.
* 7 గంటలకు ముగింపు ప్రసంగం.
* 7.10కి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.
* 8 గంటలకు అంబేద్కర్ హాల్ లో విందు కార్యక్రమం వుంటుంది.
వాహన పార్కింగ్ వివరాలు...
* ఏయూ స్నాతకోత్సవ మందిరం ఎదుట, మందిరానికి రెండు వైపులా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ, ఏయూ ఉన్నతాధికారుల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
* వీఐపీ వాహనాలను యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం ఎదుట పార్క్ చేయాలి.
* ఇతర అతిథులు, పూర్వవిద్యార్థులు, ఏయూ అధికారుల వాహనాలు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్, దూరవిద్యాకేంద్రం, ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ ప్రాంగణాల్లో నిలపాలి.
* ద్విచక్రవాహనాలను యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టాటిస్టిక్స్, పీఆర్సీ సెంటర్ ప్రాంగణాల్లో నిలపాలి.
* కాన్వోకేషన్ హాల్ కు వెళ్లే రహదారుల్లో పార్కింగ్ నిషిద్ధమన్న విషయం అంతా గుర్తించాలని అధికారులు తెలిపారు.
Visit: www.aualumni.in