: మహిళా క్రికెటర్ దుర్గాభవానీ ఆత్మహత్య

మహిళా క్రికెటర్ మద్దినేని దుర్గా భవానీ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం. విజయవాడలోని గుణదలలోని గంగిరెద్దుల దిబ్బలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దుర్గాభవానీ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మూడేళ్ల కూతురు ఉంది. కాగా, దుర్గా భవానీ సౌత్ జోన్ కు ప్రాతినిథ్యం వహించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 2009లో దుర్గాభవానీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News