: రోహిత్-రహానె భాగస్వామ్యంలో శతకం
కాన్పూర్ లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో రోహిత్, రహానెల భాగస్వామ్యం శతకం పూర్తిచేసింది. 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థి సఫారీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భారత్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, రహానె రెండో వికెట్ కి 120 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడి ఇంకొన్ని ఓవర్ల పాటు స్థిరంగా కొనసాగితే భారత్ తన లక్షాన్ని సునాయాసంగా ఛేదించే అవకాశం ఉంటుంది.