: సాన్ టినా జైత్రయాత్ర ... చైనా ఓపెన్ డబుల్స్ టైటిల్ కైవసం
ప్రపంచ టెన్నిస్ లో సానియా మీర్జా-మార్టినా హింగిస్ (సాన్ టినా) జోడీ జైత్రయాత్ర కొనసాగుతోంది. అడుగుపెట్టిన ప్రతి సిరీస్ లోను టైటిల్ ఎగురవేసుకుపోతున్న సాన్ టినా జోడీ, ఇటీవలే యూఎస్ ఓపెన్ లోనూ సత్తా చాటి టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సాన్ టినా జోడీ మరో టైటిల్ కైవసం చేసుకుంది. చైనా ఓపెన్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన సాన్ టినా జోడీ అంచనాల మేరకు రాణించి టైటిల్ చేజిక్కించుకుంది. చైనాకు చెందిన చింగ్ చాన్- యంగ్ జాన్ చాన్ జోడీతో జరిగిన ఫైనల్ లో సత్తా చాటిన సాన్ టినా జోడీ 6- 7, 6-1, 10-8 తేడాతో విజయం సాధించింది.