: సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదు: రైతులకు రాహుల్ సూచన
సమస్యలకు భయపడి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కర్నాటకలోని కరవు పీడిత ప్రాంతాల్లో రెండో రోజు పాదయాత్ర సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. హవేరీ జిల్లాలోని మైదూరు గ్రామం నుంచి ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులను ఆయన కలిశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. మైదూరులో పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడారు.