: చైనాలోని రెస్టారెంట్ లో పేలుడు... 17 మంది దుర్మరణం

చైనాలోని ఓ రెస్టారెంట్ లో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. అన్ హుయ్ ప్రావిన్స్ లోని వుహు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ పేలుడు వెనుక తీవ్రవాద హస్తం లేదని... గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం సంభవించిందని చైనా మీడియా వెల్లడించింది. పేలుడు వల్ల రెస్టారెంట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి.

More Telugu News