: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సమాచార సేకరణ, సంబంధిత అంశాల ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైందని చెప్పింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాల్సి ఉందని సీఎంఓ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 9 జిల్లాలకు తోడు కొత్తగా మరో 12 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.