: సార్, నా పెళ్లికి తప్పకుండా రావాలి: మోదీని ఆహ్వానించిన హర్భజన్

ప్రధాని నరేంద్ర మోదీని టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ కలిశాడు. తన పెళ్లికి హాజరు కావాలంటూ వివాహ ఆహ్వాన పత్రికను అందించి, మోదీని ఆహ్వానించాడు. పంజాబ్ లోని జలంధర్ కు 20 కిలోమీటర్ల దూరంలోని ఓ హోటల్ లో ఈ నెల 29న హర్భజన్ వివాహం జరగనుంది. బాలీవుడ్ నటి గీతా బస్రా, హర్భజన్ సింగ్ లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.

More Telugu News