: సల్మాన్ ‘సెల్ఫీ’ పాటలో ఎలాంటి అభ్యంతరం లేదు: బాంబే హైకోర్టు

బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిత్రం 'బజరంగీ భాయ్ జాన్' చిత్రంలోని ‘సెల్ఫీ’ అనే పాటలో ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవంటూ బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు వీఎం కనడే, షాలినిఫన్ సల్కర్ జోషి కొట్టివేశారు. ఆ పాటలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశం లేదంటూ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారని, ఇక తాము కల్పించుకోబోమని బెంచ్ వెల్లడించింది. కాగా, ‘సెల్ఫీ’ అనే పాటలో బూట్లు వేసుకుని సల్మాన్ ఖాన్ దేవుడి ముందు డ్యాన్స్ చేశారంటూ రాజ్ రాథోడ్ అనే వ్యక్తి పిల్ వేసిన విషయం తెలిసిందే.

More Telugu News