: ఉత్సాహానికి ఇది వెరీ 'గుడ్డు'!: చంద్రబాబు

తాను నిత్యమూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండటానికి గల కారణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఓ గుడ్డును తప్పనిసరిగా తింటానని, అందువల్లే పనిలో ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని ఆయన అన్నారు. ఈ ఉదయం ప్రపంచ గుడ్డు దినోత్సవంలో భాగంగా, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, వ్యవసాయంలో నష్టాలు పెరుగుతున్న వేళ రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ దిశగా కోళ్ల పరిశ్రమ, పశువుల పెంపకం వైపు దృష్టిని సారించాలని పిలుపునిచ్చారు. ఇండియాలోని పౌల్ట్రీ పరిశ్రమలో ఏపీ రెండో స్థానంలో ఉందని గుర్తు చేసిన ఆయన, గుడ్లతో తయారయ్యే వంటకాలను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. గుడ్డు ఉత్పత్తులపై పరిశోధనలు చేసే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, సహకారాన్ని అందిస్తామని చంద్రబాబు వివరించారు.

More Telugu News