: విషపూరిత మందులను జంతువులపై ప్రయోగించొద్దు : హాలీవుడ్ నటి

‘భారత దేశమంటే నా కెంతో గౌరవం. ఈ దేశాన్ని చాలా ఇష్టపడతాను. కానీ ఇలాంటి దేశంలో, విషపూరిత మందులను పరిశోధనల నిమిత్తం జంతువులపై ప్రయోగిస్తున్నారు. అది చాలా బాధగా ఉంది. దీనిపై తక్షణం నిషేధం విధించాలి’ అని హాలీవుడ్ నటి గిలియన్ అండర్సన్ అన్నారు. ఒక చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆమె, ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖకు ఒక లేఖ రాశారు. వన్యప్రాణి సంరక్షణా సంస్థ (పెటా) మద్దతుదారు కూడా అయిన గిలియన్, కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు రాసిన లేఖలో ఈ అంశాలను ఆమె ప్రస్తావించారు.

More Telugu News