: న్యూజిలాండ్ టూరిజం భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా సిద్ధార్థ్ మల్హోత్రా

భారత్ లో న్యూజిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ వర్ధమాన నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఆ దేశ పర్యాటక శాఖ నియమించింది. దీనిపై సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ, త్వరలో న్యూజిలాండ్ వెళ్తున్నానని చెప్పాడు. న్యూజిలాండ్ పర్యాటక ప్రదేశాల గురించి ఎంతో విన్నానని, ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఈ పర్యటనలో నార్త్, సౌత్ ద్వీపాలను వీక్షిస్తానని తెలిపాడు. స్కైడైవింగ్, స్కైవాక్ వంటి సాహసక్రీడలను ఆస్వాదిస్తానని తెలిపాడు. న్యూజిలాండ్ లోని పర్యాటక ప్రాంతాల గురించి భారతీయుల్లో ఆసక్ తికలిగేలా చేయడమే సిద్ధార్థ్ పని.

More Telugu News