: అతని 'బరువు' బాధ్యత మా వల్ల కాదు... చేతులెత్తేసిన వైద్యులు!

సాధారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వ్యక్తిని ఆసుపత్రి యాజమాన్యం గెంటేస్తే అదో పెద్ద వివాదమవుతుంది. కానీ అమెరికాలో ఓ వ్యక్తిని ఆసుపత్రి నుంచి గెంటేయడంలో తప్పులేదని అంతా అంగీకరిస్తున్నారు. స్టీవెన్ (33) ఊబకాయంతో బాధపడుతున్నాడు. అతని బరువు 800 పౌండ్లు అంటే 300 కేజీలు. ఈ భారీకాయంతో ఆరోగ్య సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు. దీంతో స్టీవెన్ తండ్రి కుమారుడ్ని ఊబకాయం సమస్య నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుని, వైద్యులను కలిశాడు. చికిత్స చేసేందుకు ఒప్పుకున్న వైద్యులు ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారు. వైద్యల సూచనలు పాటిస్తూ నెమ్మదిగా బరువు తగ్గుతున్నాడు. ఇంకాస్త బరువు తగ్గితే శస్త్రచికిత్స చేసి మరింత బరువు తగ్గించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇంతలో జిహ్వ చాపల్యం వదులుకోలేని స్టీవెన్ ఆసుపత్రిలో ఎవరికీ తెలియకుండా పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే, డెలివరీ బాయ్ పిజ్జాను నేరుగా ఆసుపత్రికి తెచ్చి, స్టీవెన్ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. దీనిపై ఆగ్రహించిన వైద్యులు అతని ఆహారపుటలవాట్లు వ్యసనంగా మారాయని, ఊబకాయం సమస్య నుంచి అతనిని బయటపడేయడం తమ వల్ల కాదని ఆసుపత్రి నుంచి బయటికి పంపేశారు.

More Telugu News