: బెస్ట్ బ్యూరోక్రాట్ గా ఐవైఆర్...ఏపీ సీఎస్ కు ‘ఐఈబీఎఫ్’అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావుకు ఓ అరుదైన అవార్డు లభించింది. ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం(ఐఈబీఎఫ్) ఆయనను ‘బెస్ట్ బ్యూరోక్రాట్’ గా గుర్తించింది. ఈ మేరకు నిన్న బ్రిటన్ రాజధాని లండన్ లో ‘మేక్ ఇన్ ఇండియా’ పేరిట జరిగిన ఓ సదస్సులో ఆ ఫోరం ఐవైఆర్ కు బెస్ట్ బ్యూరోక్రాట్ అవార్డును అందించింది. బ్రిటన్ మంత్రి సందీప్ వర్మ చేతుల మీదుగా నిన్న అవార్డు ప్రదానోత్సవం జరిగింది. భారత్ లో పరిశ్రమల స్థాపనకు విశేష కృషి చేసిన వారిలో మెరుగైన ఫలితాలు రాబట్టిన ఐవైఆర్ ఈ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం.

More Telugu News