: మమ్మల్ని పాకిస్థాన్ వెళ్లిపొమ్మని ఇంకా ఎంతకాలం పాటు అంటారు?: అజం ఖాన్ సూటి ప్రశ్న

తమను పాకిస్థాన్ వెళ్లిపొమ్మని ఇంకా ఎంతకాలం పాటు అంటారని ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబ్రీ మసీదు ఘటన నుంచి నేటి దాద్రీ ఘటన వరకు భారత్ లో చోటుచేసుకుంటున్న మార్పులకు ప్రపంచం సాక్షిగా మారుతోందని అన్నారు. గత ఆరు దశాబ్దాలుగా ముస్లింలు భారత్ లోనే నివసిస్తున్నారని ఆయన తెలిపారు. వారు ఏ ఇస్లామిక్ దేశానికీ వెళ్లాలని భావించడం లేదని, భారత లౌకికత్వంపై వారికి నమ్మకముందని ఆయన స్పష్టం చేశారు. భారత్ ను హిందూదేశంగా మార్చాలని కొన్ని శక్తులు చేస్తున్న కుట్రపై ముస్లింలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News