: నవరాత్రులకు చంద్రబాబును ఆహ్వానించిన దుర్గగుడి పండితులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా సందర్భంగా జరిగే దేవీనవరాత్రులకు సీఎం చంద్రబాబును దుర్గగుడి పండితులు ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎంను పండితులు కలిశారు. ఆహ్వాన పత్రికను అందజేసి దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వం తరపున చంద్రబాబు ఈ నెల 19న మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నవరాత్రులకు ఇప్పటికే దేవాదాయ శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.