: మెరుగుపడిన కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్ ఆరోగ్యం

ప్రముఖ కన్నడ కథానాయకుడు శివరాజ్ కుమార్ ఆరోగ్యం కొంత మెరుగుపడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిసింది. ఈ క్రమంలో ఆయన్ను బెంగళూరులోని విటల్ మాల్యా ఆసుపత్రి కార్డియాక్ కేర్ యూనిట్ నుంచి డీలక్స్ వార్డ్ కు మార్చారు. "ప్రస్తుతం రాజ్ కుమార్ చాలా బాగున్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. యాంజియోగ్రామ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ నిర్వహించిన నేపథ్యంలో నిన్నంతా ఆయనను కార్డియాక్ కేర్ యూనిట్ లో పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పుడాయనను డీలక్స్ వార్డులోని వీఐపీ రూమ్ కు మార్చారు" అని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఒకరు తెలిపారు. మరో రెండు రోజుల పాటు శివరాజ్ కుమార్ ఆసుపత్రి వర్గాల పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు.

More Telugu News