: మరొకరితో ఉంటుంటే, మాజీ భర్త పరిహారం ఎందుకు?: గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విడాకులు తీసుకున్న తరువాత మనోవర్తి విషయమై కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడిపోయిన తరువాత ఓ మహిళ మరో వ్యక్తితో కలసి జీవిస్తుంటే, ఇక పరిహారం ఎందుకని ప్రశ్నించింది. ఈ కేసులో మైనర్ గా ఉన్న బిడ్డకు మాత్రం తండ్రి నుంచి పోషణ ఖర్చులను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. మూడో వ్యక్తితో ఉన్నందున ఆ మహిళకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చింది. పటన్ జిల్లా నుంచి ఈ కేసు రాగా, హైకోర్టు విచారించింది. అంతకుముందు, ఈ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరుగగా, తీర్పు మహిళకు అనుకూలంగా వచ్చింది. దీనిపై ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించి, తన మాజీ భార్య మరొకరితో ఉంటున్నదని సాక్ష్యాలను చూపాడు. దీంతో మనోవర్తి ఇవ్వనవసరం లేదని తీర్పిచ్చిన కోర్టు "తెలియకుండానో లేదా అనుకోని పరిస్థితులు ఎదురైన సమయంలోనో ఒకటి రెండు సార్లు తప్పు జరిగితే దాన్ని లైంగిక బంధం కింద పరిగణనలోకి తీసుకోలేము. కానీ, అదే బంధం శాశ్వతంగా నడుస్తుంటే మాత్రం దాన్ని గురించి ఆలోచించాల్సిందే" అని వ్యాఖ్యానించింది.

More Telugu News