: సిరియాలో రష్యా దాడులు షురూ... 19 మంది ఐఎస్ ముష్కరుల హతం
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై రష్యా దాడులు ముమ్మరమయ్యాయి. గత నెల 30న ప్రారంభమై రష్యా దాదులు నిన్న ఐఎస్ ఉగ్రవాదులకు భారీ నష్టాన్నే మిగిల్చాయి. సిరియాలోని తూర్పు ప్రాంతాలైన రఖా ప్రావిన్స్, షామిరాపై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా రఖా ప్రావిన్స్ లో 15 మంది ఐఎస్ ఉగ్రవాదులు చనిపోగా, షామిరాలో నలుగురు హతమయ్యారు. ఈ దాడుల్లో ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన 12 వాహనాలతో పాటు, స్థావరాలు ధ్వంసమయ్యాయి.