: విజయనగరం బాలాజీ క్లాత్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం
విజయనగరం బాలాజీ క్లాత్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు రెండు వస్త్ర దుకాణాలకు మంటలంటుకున్నాయి. మంటలు భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. వీటిని ఆర్పేందుకు రెండు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. కాగా, విజయనగరం బాలాజీ మార్కెట్ కు ఉత్తరాంధ్రలో విశిష్టమైన పేరుంది. ఇక్కడి నుంచే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు, ఒడిశాకు వస్త్రాలు సరఫరా అవుతాయి. ఈ మార్కెట్ సముదాయంలో వందలాది వస్త్ర దుకాణాలున్నాయి. గోడౌన్లు కూడా ఇక్కడే ఉండడంతో వస్త్ర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.