: నాటుసారా తయారీ కేంద్రాలపై ‘ఆబ్కారీ’ దాడులు


కృష్ణాజిల్లా గ్రామాల్లో ఉన్న నాటుసారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ దాడులు చేసింది. 34 గ్రామాల్లో ఈ దాడులు చేసినట్లు సమాచారం. 245 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా, 11,950 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, 33 కేసులు నమోదు చేసి, 23 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నాటు సారా మత్తులో పడి కార్మికులు, కూలీలు తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారని, నాటు సారాను అరికట్టేందుకే ఈ దాడులు నిర్వహించామని చెప్పారు.

  • Loading...

More Telugu News