: డామిట్ కథ అడ్డం తిరిగింది...కుక్క పట్టేసింది!


స్నేహితుడితో పాటు తనూ దేశం దాటేద్దామని భావించి సూట్ కేసులో దాక్కుని అడ్డంగా బుక్కైన ఘటన పెరూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పెరూ రాజధాని లీమాలోని జార్జ్ ఛావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేస్తుండగా, స్నిఫర్ డాగ్ ఓ ప్రయాణికుడి లగేజ్ వెంటబడింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కుక్క వెంటపడడంతో, అతడి లగేజ్ ఓపెన్ చేయాలని అధికారులు కోరారు. సూట్ కేసు తెరిచేందుకు సదరు ప్రయాణికుడు తొలుత నిరాకరించినా, అధికారుల ఒత్తిడితో తెరవక తప్పలేదు. సూట్ కేసు తెరవగానే అందులోంచి ఓ వ్యక్తి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. దీంతో షాక్ కు గురైన విమానాశ్రయ భద్రతాధికారులు, వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని, దేశం దాటి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే ఒకరి దగ్గరే పాస్ పోర్టు, వీసా ఉండడంతో రెండో వ్యక్తి వెళ్లడానికి మరో మార్గం కనపడలేదని, అందుకే సూట్ కేసులో దాక్కుని దేశం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో వెల్లడించారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News