: కేసీఆర్ ఎలాంటి వ్యక్తో కవిత తీరు చెబుతుంది: రేవంత్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును అతని కుమార్తె కవిత చెబుతుందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ లో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఎవరైనా ఆడ బిడ్డ ఇంటి బయటకు వచ్చి జోలె పడుతోందంటే, దాని అర్థం ఆమె తండ్రి చేతకాని వాడు, తాగుబోతు, తిరుగుబోతు, కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోని వాడు అని అర్థమని అన్నారు. ఎంపీ కవిత రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది అంటే దాని అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తన కుమార్తెను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ రైతులను ఆదుకోవాలని, తక్షణం రైతు రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News