: కటక్ స్టేడియం ఘటనపై గవాస్కర్ తీవ్ర స్పందన

కటక్ స్టేడియం మైదానంలో ప్రేక్షకులు బాటిళ్లు విసిరిన ఘటనను టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. కటక్ బారాబతి స్టేడియంలో రెండు సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించకుండా నిషేధం విధించాలని సూచించాడు. ఈ ఘటనకు పోలీసులదే బాధ్యతని మండిపడ్డాడు. కటక్ కు రెండేళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్ లు కేటాయించకూడదని, అలాగే ఒడిశా క్రికెట్ సంఘానికి సబ్సిడీలు కూడా నిలిపివేయాలని గవాస్కర్ సిఫారసు చేశాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య కటక్ లో జరిగిన టి.20 మ్యాచ్ లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో స్టేడియంలోని ప్రేక్షకులు అనూహ్యంగా వాటర్ బాటిళ్లు విసరడంతో ఆటకు అంతరాయం కలిగింది.

More Telugu News