: ఆర్టిస్ట్ జీవితాంతం ఆర్టిస్టే: ఐశ్వర్యారాయ్ బచ్చన్
ఆర్టిస్ట్ ఎవరైనా జీవితాంతం ఆర్టిస్ట్ గానే ఉంటారని బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తెలిపారు. 'జజ్బా' సిినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ, కొంత కాలం తెరకు దూరంగా ఉన్నంత మాత్రాన వారి స్టేటస్ మారదని అన్నారు. ఆర్టిస్ట్ జీవితంలో విరామం లభించడం, మళ్లీ బిజీ అయిపోవడం సాధారణమని ఆమె చెప్పింది. ఎంత గొప్ప నటులైనా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలే చేస్తారని ఐశ్వర్య చెప్పింది. 'జజ్బా'లో అనురాధ వర్మ పాత్ర ఐదేళ్ల క్రితం చేసుంటే ఎలా ఉండేదో కానీ, ఇప్పుడు పాత్రను పూర్తిగా అర్థం చేసుకుని నటించానని ఆమె తెలిపింది. కాగా, కొరియా సినిమా 'సెవెన్ డేస్'ను 'జబ్బా'గా హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ సరసన ఇర్ఫాన్ ఖాన్ నటించాడు.