: పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేత
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్వర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ కౌన్సిలర్ రఘువీర్ పై హత్యాయత్నం కేసులో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు నిర్మల్ బంద్ కు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలకు యత్నించారు. మహేశ్వరరెడ్డి తన అనుచరులతో పట్టణంలో బైక్ ల ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని మామడ పోలీసుస్టేషన్ కు తరలించారు.