: టి.శాసనమండలి ఉపాధ్యక్షుడిగా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడిగా నేతి విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలిలో ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహ్మద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండలిలో కేసీఆర్ మాట్లాడుతూ, నేతి విద్యాసాగర్ ను డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నుకోవడం మండలికే గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆయన ఎంతో చాకచక్యంగా మండలిని నడిపారని సీఎం గుర్తు చేశారు.