: వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుతాం: సీఎం కేసీఆర్

వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆచార్య జయశంకర్ యూనివర్శిటీలో విత్తన కంపెనీల యజమానులు, శాస్త్రవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆచార్య జయశంకర్ వర్శిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున విత్తన కంపెనీలు దత్తత తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. 95 నియోజకవర్గాల్లో గ్రామాలను దత్తత తీసుకునే నిమిత్తం విత్తన కంపెనీలు ముందుకు రావాలని కోరామన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

More Telugu News