: ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నా: దర్శకుడు సుభాష్ ఘాయ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ కలిశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, ముఖ్తా ఆర్ట్స్ ద్వారా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తామని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్, కేటీఆర్ తో అన్నట్లు సమాచారం. రాచకొండ వద్ద నిర్మితమయ్యే ఫిల్మ్ సిటీలో సంస్థను ఏర్పాటు చేయమని సుభాష్ ను మంత్రి కోరారు. కాగా, కాళీచరణ్, కర్జ్, హీరో, మేరీ జంగ్, కర్మా, రామ్ లఖాన్, సౌదాగర్, ఖల్ నాయక్, పర్దేశ్, తాళ్ వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను సుభాష్ ఘాయ్ నిర్మించారు.