: ఫిల్మ్ నగర్ లోని నివాసానికి ఏడిద భౌతికకాయం

ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని ఈ ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. ఏడిదను చివరిసారి చూసి నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నివాసానికి వస్తున్నారు. ఈ సాయంత్రం టోలీచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న(ఆదివారం) ఏడిద తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

More Telugu News