: టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ప్రమాణం...గుండుతో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు

టీడీపీ యువ సంచలనం, పాలమూరు జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. నిన్న హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ జాతీయ, రెండు తెలుగు రాష్ట్రాల నూతన కమిటీ సభ్యులు కొత్త పదవులను చేపట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గుండుతో హాజరయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణా రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి దశ దిన కర్మల సందర్భంగా రేవంత్ రెడ్డి గుండు గీయించుకున్నారు.

More Telugu News