: బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ ఏకగ్రీవం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏక్రగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడి రేసులో నిలిచేందుకు శశాంక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈస్ట్ జోన్ లోని ఆరు క్రికెట్ సంఘాలు మనోహర్ కు మద్దతుగా నిలిచాయి. ఈస్ట్ జోన్ కు చెందిన జగన్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో ఈ పదవి ఖాళీ అయింది.

More Telugu News