: అనవసర విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారా?: వీహెచ్

రైతుల ఆత్మహత్యలను పక్కన పెట్టి, అనవసర విషయాలను తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభ్యులు అనవసర విషయాలను ప్రస్తావిస్తూ విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నాక వచ్చే బంగారు తెలంగాణ ఎవరి కోసమంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకు రావాలంటూ ఈ సందర్భంగా హనుమంతరావు కోరారు.

More Telugu News