: సోమనాథ్ భారతిపై నాలుగో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతిపై ఆ రాష్ట్ర పోలీసులు నాలుగో కేసు నమోదు చేశారు. భార్య లిపికా మిత్రాపై గృహ హింస, హత్యయత్నంపై ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు, న్యాయస్థానం లొంగిపోవాలని ఆదేశించినా తప్పించుకుని తిరగడంపై మూడో కేసు నమోదు చేశారు. అలాగే న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి ఆఫ్రికా మహిళలపై దాడులు చేసిన ఘటనపై ఢిల్లీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీనిపై మెజిస్ట్రేట్ వద్ద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారి అందజేసిన నివేదికను అక్టోబర్ 30న విచారణకు స్వీకరిస్తామని న్యాయస్థానం తెలిపింది. ప్రస్తుతానికి సోమనాథ్ భారతి ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు.

More Telugu News