: కాకా విగ్రహ ధ్వంసానికి యత్నించిన ఎమ్మార్పీఎస్

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ ఉంచిన దివంగత కాంగ్రెస్ నేత కాకా (వెంకటస్వామి) విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు యత్నించారు. ఈ విగ్రహాన్ని కేటాయించిన స్థలంలోనే ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ పార్కులో కాదని వారు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను అరెస్ట్ చేసి, అక్కడ నుంచి తరలించారు. కాకా మీద గౌరవంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.

More Telugu News