: పశ్చిమ బెంగాల్ లో రణరంగం...‘స్థానిక’బరిలో కొట్టుకున్న తృణమూల్, లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు

పశ్చిమబెంగాల్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఘర్షణలు తప్పనిసరిగా మారాయి. సుదీర్ఘకాలం పాటు అధికారం చెలాయించిన వామపక్షాల కార్యకర్తలు అధికారం చేజారడంతో రెచ్చిపోతున్నారు. అదే సమయంలో వామపక్షాల చేతిలో నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారికి తగిన రీతిలోనే జవాబిస్తున్నారు. వెరసి ఆ రాష్ట్రంలో నిత్యం ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. బిదన్నాగర్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేటి ఉదయం మరోమారు ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల కళ్లెదుటే, పోలింగ్ కేంద్రం సాక్ష్యంగా జరిగిన ఈ ఘర్షణలో ఇరు పార్టీ కార్యకర్తలు కలబడ్డారు. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఘర్షణలతో బిదన్నాగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News