: శేషాచలం అటవీప్రాంతంలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీప్రాంతంలో అటవీ శాఖ, ప్రత్యేక కార్యాదళ సిబ్బంది ఈ రోజు ఉదయం భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కల్యాణిడ్యాం, ఎర్రగుట్ట ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆ సమయంలో కూలీలు ఎర్రచందనం దుంగలను తీసుకెళుతుండటాన్ని గమనించారు. వెంటనే ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రెండున్నర టన్నుల ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ కోటిన్నర ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం శేషాచల అటవీప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది.