: పొట్టి క్రికెట్ 1000 పరుగుల క్లబ్ లో కోహ్లీ... తొలి భారతీయ ఆటగాడు అతడే!

పొట్టి క్రికెట్ గా పేరుపడ్డ టీ20 ఫార్మాట్ లో నిన్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో వెయ్యి పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా నిన్న ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగి తొలి టీ20 మ్యాచ్ లో 12వ ఓవర్ లో సఫారీ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన మూడో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ ఈ ఫీట్ ను సాధించాడు. ఇక పొట్టి క్రికెట్ లో ఇప్పటిదాకా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న వారు ప్రపంచంలో మరో 19 మంది ఉన్నారు. వీరి సరసన కోహ్లీ స్థానం సంపాదించాడు.

More Telugu News