: చరణ్ లో నన్ను నేను చూసుకుంటా: చిరంజీవి
రామ్ చరణ్ లో తనను తాను చూసుకుంటానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హైదరాబాదులోని నోవాటెల్ లో జరిగిన 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్ లో గ్రేస్, స్టైల్, ఈజ్ తనను తనకు గుర్తు చేస్తాయని అన్నారు. 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమాలో తన పాత్ర పసందైన భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకున్నంత మజాగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. సినిమా అద్భుతంగా ఉంటుందని, అభిమానులను అలరిస్తుందని చిరంజీవి చెప్పారు. చరణ్ ను ఎలా చూసినా తానే కనిపిస్తానని చిరంజీవి తెలిపారు.