: మాయావతిని ప్రశ్నించిన సీబీఐ

జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్ హెచ్ఎం) కుంభకోణం కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని సీబీఐ ప్రశ్నించింది. 2011 నుంచి ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించి జరిగిన కుట్రలో మాయావతిని ప్రశ్నించాలని సీబీఐ చాలా కాలంగా ప్రయత్నించింది. కాగా, తనను విచారించడం కోసం సీబీఐని తన జేబు సంస్థలాగా బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందంటూ మాయావతి మండిపడ్డారు. ఈ కేసులో తనను ఇరికించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని అన్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీని అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతోనే బీజేపీ ఇటువంటి పనులకు పాల్పడుతోందంటూ ఆమె మండిపడ్డారు.

More Telugu News