: మానాన్న చిరుతో, నేను చరణ్ తో చేశాం: అరుణ్ కుమార్
'స్నేహం కోసం' సినిమాలో తన తండ్రి విజయ్ కుమార్ మెగాస్టార్ చిరంజీవితో నటించగా, తాను ఆయన కుమారుడు రామ్ చరణ్ తో 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమాలో పనిచేశానని నటుడు అరుణ్ కుమార్ తెలిపారు. నోవాటెల్ లో బ్రూస్ లీ దఫైటర్ సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తొలిసారి తెలుగు సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అన్నాడు. రామ్ చరణ్ డాన్సులు, ఫైట్లకు తాను పెద్ద అభిమానినని అరుణ్ చెప్పాడు. తామిద్దరం షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశామని, సినిమా చూసేటప్పుడు కూడా అభిమానులు అంతే ఆనందిస్తారని అరుణ్ తెలిపాడు. సినిమా అద్భుతంగా ఉంటుందని, అభిమానులను అలరిస్తుందని అరుణ్ చెప్పాడు. తమన్ తో నాలుగు సినిమాలకు పని చేశానని, ఆయన సంగీతం అద్భుతంగా ఉంటుందని అరుణ్ తెలిపాడు.