: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ భేటీ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో గవర్నర్ కు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. వాటర్ గ్రిడ్ పథకం పూర్తయితే విపక్షాలు నోరు మూసుకుంటాయని అన్నారు. వాటర్ గ్రిడ్ టెండర్ కేటాయింపుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపై విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన గవర్నర్ కు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టుల రీడిజైన్ పై టీఆర్ఎస్ ప్రభుత్వ విధానంపై ఆయన గవర్నర్ కు చెప్పారు. విపక్షాలు కోరినట్టుగా శాసనసభ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నామని గవర్నర్ కు ఆయన వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇస్తున్న విధానం, తెలంగాణకు నిధులు విడుదల చేయకపోవడంపై గవర్నర్ దగ్గర కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.