: గొలుసు దొంగలపై పీడీ యాక్టు: సీపీ మహేందర్ రెడ్డి
గొలుసు దొంగతనాల్లో పట్టుబడిన దొంగలపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న గొలుసు దొంగలను కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ పట్టుబడ్డ 46 మంది గొలుసు దొంగలపై పీడీ యాక్టు నమోదు చేశామని మహేందర్ రెడ్డి వివరించారు. ఇటీవల హైదరాబాద్ లో గొలుసు దొంగతనాలు ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. బైక్ లపై వచ్చి మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను అమాంతం లాక్కుపోయిన సంఘటనల్లో సదరు బాధితులు గాయపడిన దాఖలాలు ఉన్నాయి.