: నేపాల్ ప్రధాని రాజీనామా
నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలా రాజీనామా సమర్పించారు. నేపాల్ రాజ్యంగంలో మార్పులు చేర్పులు కోరుతూ పలు వర్గాలకు చెందిన ప్రజలు గత కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ కోయిరాలా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాసేపట్లో రాష్ట్రపతికి సమర్పించనున్నారు. కాగా, కోయిరాలా ఆధ్వర్యంలోని నేపాల్ ప్రభుత్వం గతేడాది భూకంపం సంభవించిన సమయంలో ఎంతో ఆత్మస్థైర్యం ప్రదర్శించింది. ప్రపంచ దేశాల సాయంతో అతలాకుతలమైన నేపాల్ ను పునర్నిర్మించిన సంగతి తెలిసిందే.