: బ్రహ్మాండమైన నగరంగా అమరావతిని నిర్మించుకుందాం: సీఎం చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతి ఒక అందమైన ప్రదేశమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచమంతా చర్చించే విధంగా అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పారు. బ్రహ్మాండమైన నగరంగా అమరావతిని నిర్మించుకుందామని పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టామని, నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. గుంటూరులో ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర స్థిరాస్తి ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా రాజధాని నిర్మాణానికి అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. స్థిరాస్తి వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.