: దీక్ష చేస్తానన్న జగన్ డైలమాలో పడ్డారు: టీడీపీ నేత విమర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడతానన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అయోమయ స్థితిలో పడ్డారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. దీక్ష చేస్తానని చెబుతున్న జగన్ ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా వేస్తూ వచ్చారన్నారు. వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దీక్షలు చేస్తే ప్రత్యేక హోదా రాదని అన్నారు. ఒకవేళ రఘువీరా దీక్ష చేయాలనుకుంటే, ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ను, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి ప్రధాని మోదీ నివాసం ముందు దీక్ష చేయాలని ఆయన సూచించారు.