: ‘మీలో ఎవరు క్రిస్టియన్లు ? ... ఎవరు కాదు?’ అని అడిగి మరీ కాల్చేశాడు!
కళాశాల తరగతి గదిలోకి సాయుధుడై వెళ్లిన ఒక యువకుడు ‘మీలో ఎవరు క్రిస్టియన్లు? ఎవరు కాదు?’ అని అడుగుతూ, 9 మందిని కాల్చిపారేశాడు. చివరకు పోలీసుల చేతిలో హతమైన ఈ ఉన్మాది యువకుడి సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా ఒరెగాన్ రోజ్ బర్గ్ లో ఉన్న కళాశాల తరగతి గదిలోకి సాయుధుడైన క్రిస్ హార్పర్(26) వెళ్లాడు. ఇట్లాంటి అవకాశం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నానంటూ తరగతి గదిలోని ప్రొఫెసర్ ను మొదట కాల్చిపారేశాడు. అనంతరం అతను జరిపిన విచక్షణా రహిత కాల్పులకు విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. దేవుణ్ణి చూపిస్తానంటూ తొమ్మిది మంది విద్యార్థులను కాల్చేశాడు. ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హార్పర్ ను కాల్చేశారు. ఈ సంఘటనపై హార్పర్ తండ్రి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే, అతడి వివరాలను పోలీసులు బయటపెట్టడం లేదు.