: ఏయూ ప్రొఫెసర్లకు ప్రభుత్వం నోటీసులివ్వడం సిగ్గు చేటు: వైసీపీ
విశాఖలో వైఎస్ జగన్ నిర్వహించిన యువభేరి సదస్సులో పాల్గొన్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ప్రభుత్వం నోటీసులివ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ మండిపడుతోంది. ఆరుగురు ప్రొఫెసర్లకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి సీఎం అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. విదేశీ యాత్రలు మాని ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని సూచించారు.